వాషింగ్టన్ : సిఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో సంస్థల పాత్రికేయులను శ్వేతసౌధంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఫెడరల్ న్యాయమూర్తి కెల్లీ తోసిపుచ్చారు. వైట్‌హౌస్‌లోకి వారి ప్రవేశాన్ని వెంటనే పునరుద్ధరించాలని, వారికి ప్రెస్ పాసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ మూడు మీడియా సంస్థలపై విధించిన నిషేధం రాజ్యాంగ విరుద్ధం కావచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ నెల 18న ట్రంప్ తమపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ వార్తా సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యంపై యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి టిమ్ కెల్లీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధాన్ని 14 రోజుల పాటు అమలు చేయవద్దని అధికారులను ఆయన ఆదేశించారు. భద్రతా పరమైన ఆందోళన కారణంగానే నిషేధాన్ని విధించామంటూ ప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చారు. ‘పాస్‌లను రద్దు చేస్తే జాతీయ భద్రత పరిరక్షించబడుతుందని కానీ లేదా ఈ వ్యాజ్యం కొనసాగుతున్నప్పుడు కోర్టు వారి పాస్‌లను పునరుద్ధరించాలని ఆదేశిస్తే జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని కానీ ప్రతివాదులు చేస్తున్న వాదనకు ఆధారాలేవీ లేవు’ అని చెప్పారు. నిజాయితీ లోపించడం వల్ల, ప్రతికూలత కారణంగానే నిషేధం విధించామని ట్రంప్ స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు.
మీడియాపై వైట్‌హౌస్ నిషేధం కుదరదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



