Homeఅంతర్జాతీయంఅఫ్గానిస్థాన్‌లో 10 చోట్ల వైమానిక దాడులు చేసిన పాకిస్థాన్‌

అఫ్గానిస్థాన్‌లో 10 చోట్ల వైమానిక దాడులు చేసిన పాకిస్థాన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పక్తియా, ఖోస్ట్‌, కాందహార్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు సమాచారం. కాందహార్‌ తాలిబన్‌ సుప్రీం లీడర్‌ హిబతుల్లా అఖుంద్‌జాదా నివాస ప్రాంతంగా కూడా ఉంది. పాక్‌ సమాచార మంత్రి అట్టా తారర్‌ అఫ్గానిస్థాన్‌లో 10 లక్ష్యాలపై వైమానిక, డ్రోన్‌ దాడులు నిర్వహించినట్లు ధ్రువీకరించారు. అయితే దాడుల్లో ప్రాణనష్టంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -