- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెరైన్ డ్రైవ్‌లో రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు. మృతుల్లో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్ ఉన్నారు. ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. కారు తీవ్రంగా దెబ్బతినడంతో పోలీసులు అందులోని నలుగురినీ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారంతా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులను సార్థక్, నామన్ గుప్తా, వంశికా ఖండేల్‌వాల్, త్రిషా సింగ్‌గా గుర్తించారు.
- Advertisement -



