Homeతాజా వార్తలువేలం పాటలో లడ్డూకు రికార్డ్ ధర

వేలం పాటలో లడ్డూకు రికార్డ్ ధర

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో గణేశ్ నవరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన వేలం పాటలో లడ్డూకు రికార్డ్ ధర లభించింది. ‘శక్తిమాన్‌’ టీమ్ రూ.1.01 కోట్లకు లడ్డూను దక్కించుకుంది. ఈ వేలం ద్వారా సమకూరిన నిధులను ఆర్పీ దియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని నిర్వహకులు తెలిపారు. పనిమనుషులు, డ్రైవర్లు, స్థానిక పేద కుటుంబాల పిల్లల పాఠశాల ఫీజులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే పేదలకు ఉచిత వైద్య సహాయం, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -