Homeతాజా వార్తలు'పారడైజ్' సినిమా.. కేసీఆర్ పాత్రలో ఆకట్టుకున్న ప్రియదర్శి

‘పారడైజ్’ సినిమా.. కేసీఆర్ పాత్రలో ఆకట్టుకున్న ప్రియదర్శి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్‌’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ఈ యాక్షన్‌ డ్రామా ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ సందడి చేస్తోంది. ముఖ్యంగా ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్‌ పాత్రపై చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో ప్రియదర్శి తెలంగాణ రాజకీయ నాయకుడిని పోలిన గెటప్‌లో కనిపించినట్లు అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయన హావభావాలు, మాటతీరు, తెలంగాణ యాస ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కొన్ని సన్నివేశాల్లో మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలినట్లు అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కేసీఆర్‌ ప్రసంగాల్లో కనిపించే శైలి, బాడీ లాంగ్వేజ్‌ను గుర్తు చేసేలా ప్రియదర్శి నటన ఉందంటూ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. సినిమాలో ఆయన పాత్ర ఎలా సాగుతుంది? ఎలాంటి సన్నివేశాల్లో కనిపిస్తారు? అన్నది తెరపై చూడాల్సిందే. అయితే సినిమా విడుదలైన వెంటనే ప్రియదర్శి పాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -