గోవా గార్డియన్స్ ట్రోఫీలో శుభారంభం
గోవా: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు ఇటీవల విజయవాడలో నిర్వహించిన అండర్-21 ట్రయల్స్‌లో ప్రతిభావంతులైన తెలుగు నలుగురు తెలుగు క్రీడాకారులకు జట్టులోకి తీసుకుంది. కార్తిక్ ( గుంటూరు), ధీమన్ ( వైజాగ్), స్రునిక్ (పెద్దపల్లి), అక్షిత్ ( వరంగల్ ) బ్లాక్‌హాక్స్ జట్టులో నిలిచారు. గోవా వేదికగా శుక్రవారం ప్రారంభమైన అండర్-21 గోవా గార్డియన్స్ ట్రోఫీలో బ్లాక్ హాక్స్ జట్టు శుభారంభం చేసింది. బెంగళూరుపై హైదరాబాద్ 3-0తో నెగ్గింది. హైదరాబాద్ 15-8, 15-13, 16-14తో హ్యాట్రిక్ సెట్లలో నెగ్గి, విజయం సాధించింది. ఈ ట్రోఫీలో బ్లాక్ హాక్స్ సహా పీవీఎల్‌లోని పది జట్లు పోటీ పడుతున్నాయి.
బ్లాక్‌హాక్స్ జట్టులో నలుగురు తెలుగోళ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



