బంగ్లాదేశ్ 351/6
ఆస్ర్టేలియాతో తొలి టెస్ట్
డార్విన్(ఆస్ర్టేలియా) : ఆస్ర్టేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ర్టేలియాను 198పరుగులకే పరిమితం చేసిన బంగ్లాదేశ్.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి రెండోరోజు ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 351పరుగులు చేసింది. ఓపెనర్ తమీమ్ హసన్(101) సెంచరీకి తోడు కెప్టెన్ నజ్ముల్(84) అర్ధసెంచరీతో రాణించారు. లోయర్ ఆర్డర్‌లో మెహిదీ హసన్(32), మహమూద్(13) మరో వికెట్ పడకుండా ఆదుకున్నారు. దీంతో రెండోరోజు ఆట నిలిచే సమయానికి బంగ్లాదేశ్ జట్టు 153పరుగుల కీలక కీలక ఆధిక్యతను సంపాదించింది. ఆస్ర్టేలియా బౌలర్లు స్టార్క్, హేజిల్‌వుడ్‌కు రెండేసి, కమిన్స్, లియాన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.



