- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కూకట్‌పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాత్రి తీజ్ వేడుకల్లో ఓ విద్యార్థిపై పలువురు దాడి చేశారు. ఆ తర్వాత గౌతమి, మంజీరా హాస్టల్‌లో విద్యార్థులు పరస్పరం దాడులకు దిగడంతో జేఎన్టీయూ రణరంగంగా మారింది. ఘర్షణలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
- Advertisement -



