దర్శకుడు సంపత్ నంది నిర్మాణ సంస్థ సంపత్ నంది టీమ్‌వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత కె.వి. శ్రీధర్ రెడ్డితో కలిసి తన రెండవ చిత్రాన్ని నిర్మించ డానికి సిద్ధమవుతోంది. ఆదిత్య మూవీస్ బ్యానర్ సమర్పిస్తోంది. అఖిల్ రాజ్, నాగ దుర్గ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంపత్ నంది శిష్యుడైన రాజ్ గణేష్ ఉప్పునూతి ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ‘శనార్తి’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. రామానాయుడు స్టూడియోలో ప్రముఖ సినీ ప్రముఖులు, చిత్ర బృందం సమక్షంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.
సంపత్ నంది మాట్లాడుతూ,‘‘శనార్తి’.. పల్లెటూరిలో చాలా స్వచ్ఛంగా, ఆత్మీయంగా పలకరించుకున్నప్పుడు ఉపయోగించే పదం ఇది. ఈ ప్రేమకథకి ఈ పదం అచ్చంగా సరిపోతుంది. అఖిల్‌కి ఈ కథ చాలా నచ్చింది. అలాగే నాగ దుర్గ కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి రావడానికి కారణం అఖిల్. సురేష్ బొబ్బిలి చక్కని సంగీతం అందిస్తున్నారు’ అని అన్నారు. ‘సంపత్ నందికి ఈ కథ చెప్పగానే చాలా నచ్చింది. మా నిర్మాత శ్రీధర్ కి ధన్యవాదాలు’ అని దర్శకుడు గణేష్ చెప్పారు. నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ,‘ఈ కథ వినగానే నాకు చాలా నచ్చింది. ఇది అద్భుతమైన కథ. సంపత్ నంది తో పనిచేయడం హ్యాపీ’ అని తెలిపారు.
‘శనార్తి’ మొదలైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



