Friday, September 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకొండా సురేఖను తెలంగాణ భవన్‌ గేటును తాకనివ్వం: జగదీశ్ రెడ్డి

కొండా సురేఖను తెలంగాణ భవన్‌ గేటును తాకనివ్వం: జగదీశ్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆమె బీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానిచ్చే ప్రసక్తే లేదని, తెలంగాణ భవన్‌ గేటు కూడా తాకనివ్వబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలను తిరిగి చేర్చుకోబోమని, ఒకరిద్దరికి తప్ప మిగతా ఎవరికీ గులాబీ తలుపులు తెరిచేది లేదని తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నా పార్టీలోకి తీసుకోమని పేర్కొన్నారు. సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్‌ వైఫల్యాలు, 22ఏ భూముల స్కామ్‌ను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -