Friday, September 4, 2026
E-PAPER
Homeజాతీయంభారత్ కు చారిత్రక విజయం: ఇస్రో ఛైర్మన్‌

భారత్ కు చారిత్రక విజయం: ఇస్రో ఛైర్మన్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17/ఈఓఎస్‌-05 ప్రయోగం భారత్‌ అంతరిక్ష కార్యక్రమంలో చారిత్రక విజయమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ డాక్టర్‌ వి. నారాయణన్‌ అన్నారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 వాహకనౌక 2,367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్‌-05ను నిర్దేశిత సబ్‌-జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టిందని తెలిపారు. రాకెట్‌లోని అన్ని వ్వయస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. శ్రీహరికోట నుంచి జరిగిన ప్రయోగాల్లో ఇది 107వ మిషన్‌ కాగా.. జీఎస్‌ఎల్‌వీ వాహకనౌకకు 19వ ప్రయోగమని నారాయణన్‌ తెలిపారు. జీఎస్‌ఎల్‌వీ తొలి ప్రయోగమైన డీ1లో 1,536 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని మాత్రమే మోసుకెళ్లగా.. నిర్మాణ రూపకల్పన, ప్రొపల్షన్‌ వ్యవస్థల్లో చేసిన నిరంతర అభివృద్ధితో రాకెట్‌ సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. తాజాగా 2,367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జీఎస్‌ఎల్‌వీ సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -