Friday, September 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విషాదం.. ఈతకు వెళ్లిన బాలుడి మృతి

విషాదం.. ఈతకు వెళ్లిన బాలుడి మృతి

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్ : మండల కేంద్రానికి చెందిన దేవిదాస్ (16) శుక్రవారం డోడర్నా గ్రామ సమీపంలోని ఎల్లమ్మ చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే గొర్రెలు మేతకు తీసుకువెళ్లి అక్కడి చెరువులో ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో తోటి వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎస్సై కృష్ణారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దేవిదాస్ మృతితో కుబీర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా గత నెల 10న ఇదే చెరువులో ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. నెలలోనే ముగ్గురు మృతి చెందడంతో పలువురు భయంతోనే గురవుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -