Saturday, August 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలునవ్వించే 'జార్జ్ క్రిష్'

నవ్వించే ‘జార్జ్ క్రిష్’

- Advertisement -

హీరో శర్వా తొలిసారి దర్శకుడు శ్రీను వైట్లతో ఓ సినిమా చేయబోతున్నారు. ఏటీవీ సమర్పణలో అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ఈ చిత్రం 2027 జనవరి 14న సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదల కానుంది. సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌ కు నిర్మాత సురేష్ బాబు కెమెరాను స్విచ్ ఆన్ చేయగా, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా తొలి షాట్‌ను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవం రోజే ప్రపంచవ్యాప్త థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్స్ వివరాలను ప్రకటించడం విశేషం. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ,‘ఈ సంవత్సరం ‘నారి నారి నడుమ మురారి’ తర్వాత శర్వాతో మళ్ళీ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా నా ప్రియమిత్రుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయడం ఇంకా ఆనందంగా ఉంది. సంక్రాంతికి ఈ సినిమా నవ్వులు కురిపిస్తుంది’ అని అన్నారు. ‘నందు అద్భుతమైన కథ ఇచ్చాడు. కథ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని డైరెక్టర్ శ్రీను వైట్ల చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -