నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వర్షం నీరు చేరుకున్నాయి. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచినట్లు సమాచారం. ఢిల్లీలో వర్షాల కారణంగా పల్లపు ప్రాంతాలు, అండర్‌పాస్‌లలో నీరు నిలిచిపోయే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ IMD ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయాలు, ప్రజా రవాణాలో జాప్యం జరగనుందని తెలియజేసింది. ఎయిర్ పోర్టు సిబ్బంది వరద నీరు కట్టడికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా సాయంత్రం రావాల్సిన పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ఎయిర్‌పోర్టులో నీరు చేరిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




