నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హైస్కూల్‌లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వ విద్యార్థి పరిషత్ తెలంగాణ అధ్యక్షులు రెడ్డిగారి హరిస్మరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచానికి జగద్గురువు శ్రీకృష్ణుడని, భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడిని ఆరాధించే వారికి మంచి ఫలితాలు లభిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మంచి పనులు చేయడం ద్వారా జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చని, చేసిన కర్మకు ప్రతిఫలం తప్పక ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారుల సందడి, సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షులు గంగారెడ్డి, ప్రబంధకారిణి కార్యదర్శి మల్లేష్ యాదవ్, సంచాలన సమితి అధ్యక్షులు బొడ్డు శంకర్, విద్వత్ సమితి సభ్యులు నారా గౌడ్, ఎస్.ఎన్. చారి, సంచాలన సమితి కార్యదర్శి గోపాలకృష్ణ, సహకార్యదర్శి రాజేందర్ గౌడ్, విభాగ్ శైక్షణిక్ సంయోజక్ పక్కి శ్రీనివాస్, పాఠశాల ప్రధానాచార్యులు నల్ల నాగభూషణం, అకాడమిక్ ప్రిన్సిపల్ నాగేష్, ఆచార్య బృందం, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శిశు మందిర్‌లో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



