Homeతెలంగాణ రౌండప్గణపయ్య మండపంలో పోషణ మాస సంబరాలు

గణపయ్య మండపంలో పోషణ మాస సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
పుట్టబోయే బిడ్డ గర్భంలో ఉన్నప్పటినుండి రెండు సంవత్సరాల వరకు ఉండే మొదట వెయ్యి రోజులు అత్యంత కీలకమని ఐసిడిఎస్ సిడిపిఓ కళావతి తెలిపారు. సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తున్న ‘రాష్ట్రీయ పోషణ్ మాహం – 2026’ పురస్కరించుకొని ఐసిడిఎస్ మద్నూర్ ప్రాజెక్ట్ పరిధిలోని గణేష్ మండపాలలో అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో గణపయ్య మండపంలో పోషణ మాస సంబరాలు 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా గణనాథుని మండపాలలో స్వామివారికి సమర్పించే ప్రసాదాలతో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన ‘బజ్జి కూర’, తృణధాన్యాల (మిల్లెట్స్) పిండివంటలు, ఆకుకూరలు, పండ్లను ప్రత్యేక నైవేద్యంగా సమర్పించి ప్రదర్శించారు.  

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు మాట్లాడుతూ..గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మండపాలకు వచ్చే భక్తులకు, కమ్యూనిటీ ప్రజలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.  బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుండి 2 సంవత్సరాల వయస్సు వరకు ఉండే మొదటి 1000 రోజులు అత్యంత కీలకమని, ఈ సమయంలో గర్భిణులు, బాలింతలు సమతుల్య పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన తరంతో పాటు బలమైన భారత్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.  గ్రామంలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలందరూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలనూ  పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  మన అంగన్‌వాడీ – మన బాధ్యత అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పిల్లల ఎదుగుదల  పోషణ పట్ల శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.  

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ కళావతి, మద్నూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీల టీచర్లు చెంపబాయి, కళావతి, యమునా, గేందబాయి, సుశీల, మాధవి, స్రవంతి, చంద్రకళ , వీరితోపాటు బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు,   గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గర్భిణులు, బాలింతలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -