Homeజాతీయంసాహిల్ తల్లిదండ్రులకు రాహుల్ గాంధీ ఫోన్..

సాహిల్ తల్లిదండ్రులకు రాహుల్ గాంధీ ఫోన్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్‌ వాకోడే ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. సాహిల్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పిన రాహుల్‌ గాంధీ.. సాహిల్‌కు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో వెనుకబడిన, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులపై జరుగుతున్న వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు బలమైన వ్యవస్థీకృత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -