Homeతెలంగాణ రౌండప్వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలి

వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-సంగారెడ్డి 
ప్రభుత్వ శాఖల్లో వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు గుర్తించి భర్తీ చేయాలని ఎన్ పి ఆర్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి  కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ధర్నాను ఉద్దేశించి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2027 జనాభా లెక్కల వివరాలు సేకరించాలని నిర్ణయం చేసిందన్నారు.2016 వికలాంగుల హక్కుల చట్టం 21 రకాల వైకల్యాలను గుర్తించిందని,కానీ 9 రకాల వైకల్యాలు కలిగిన వారీ వివరాలు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆటీజం, నిర్థిష్ట అబ్యాసన వైకల్యాలు, మరుగుజ్జుతనం, కుష్ఠువ్యాధి నయమైన వ్యక్తులు, చెవిటి, బ్లైండ్, బహుళ వైకల్యాలు వంటి వారిని లెక్కించడం లేదని, 2016 ఆర్ పి డి చట్టాన్ని ఉల్లంగించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడిదని అన్నారు.

అన్ని రకాల రక్త సంబంధిత రుగ్మాతలను ఒకే వర్గంగా లెక్కించాలని ప్రభుత్వం నిర్ణయం చేయడాన్ని ఖండించారు.వికలాంగుల వివరాలు సమగ్రంగా సేకరించకుంటే విద్యా, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, పునరావాసం, సామాజిక భద్రతతో పాటు వికలాంగులు పొందే అన్ని రకాల సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వలన వికలాంగుల జనాభా తగ్గడానికి అవకాశం ఉందని అన్నారు.వికలాంగుల జనాభాను తగ్గించి చూపి వికలాంగుల సంక్షేమన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చెస్తుందని అన్నారు.అంగవైకల్యం ఉన్న ప్రతి వికలాంగుని వివరాలు జనాభా లెక్కల సేకరణలో సేకరించే విదంగా సెన్సెస్ పత్రంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశంలో 16 శాతం వికలాంగుల జనాభా ఉందని లెక్కలు చెపుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వికలాంగుల జనాభాను తగ్గించి చూపించాలని కుట్ర పూరితంగా ఆలోచన చేస్తుందని అన్నారు.

సంఘం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి కొనింటి నర్సిములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి, భర్తీ చేసేందుకు 2026 ఆగష్టు 18 నాడు జివో 19 విడుదల చేసిందని అన్నారు.గత 14 సంవత్సరాలనుండి జిల్లాల్లో వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడం లేదని అన్నారు.  జిల్లాలోని అనేక ప్రభుత్వ శాఖల్లో వికలాంగుల పోస్టులు ఖాళీగా ఉన్నయని తెలిపారు జిల్లాల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ల్ లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో భర్తీ చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్స్ వికలాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాంచందర్, రాజకుమార్ సంగమేశ్వర్, సహాయ కార్యదర్శులు కృపవరం, శంకర్ నాయక్, జిల్లా నాయకులు చౌహన్, భాగ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -