నవతెలంగాణ- నాచారం: నాచారం సర్కిల్ మల్లాపూర్కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ వీఎన్‌ఆర్ గార్డెన్‌లో ఉప్పల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 233 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారాయని తెలిపారు. ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక భారం తగ్గించడంలో ఈ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం తులం బంగారం కూడా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మార్వో పూల్ సింగ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



