Saturday, May 23, 2026
E-PAPER
Homeజాతీయంలద్దాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌..తృటిలో ప్రాణాపాయం

లద్దాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌..తృటిలో ప్రాణాపాయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : లద్దాఖ్‌లో భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత బుధవారం లేహ్ పరిసర పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం అనంతరం వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని అధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఈ ఘటనకు గల కారణాలపై ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -