Saturday, August 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజాతీయ జెండాకు అవమానం..

జాతీయ జెండాకు అవమానం..

- Advertisement -

నవతెలంగాణ – బయ్యారం: మేజర్ గ్రామ పంచాయతీ బయ్యారం కార్యాలయంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పంచాయతీ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పంచాయతీ కార్యదర్శి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో జాతీయ జెండాకు అవమానం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం అయిన తర్వాత బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోతు శాంతి కిషన్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించగా, అది తలకిందులుగా ఎగిరింది. ఆ తర్వాత జనగణమన గీతాన్ని కూడా ఆలపించారు.

జెండా తలకిందులుగా వేలాడుతున్న విషయాన్ని అక్కడున్న ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, అతిథులు గమనించడంతో పంచాయతీ సిబ్బంది వెంటనే జెండాను కిందకు దించి సరిదిద్దే ప్రయత్నం చేశారు. జాతీయ జెండా పట్ల బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించి అవమానపరిచిన పంచాయతీ సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎం.పి.ఓ నాగరాజు, సొసైటీ చైర్మన్ బండారి మల్లయ్య, పంచాయతీ వార్డు సభ్యులు, సిబ్బంది లతీఫ్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -