Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీ సేవలు గుర్తించి అవార్డు రావడం అభినందనీయం

మీ సేవలు గుర్తించి అవార్డు రావడం అభినందనీయం

- Advertisement -

పెద్ద టాక్లి గ్రామంలో హౌసింగ్ ఏఈ కి సన్మానం
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండలంలో హౌసింగ్ ఏఈ గా విధులు నిర్వహిస్తున్న హనుమంత్ ఉద్యోగి సేవలు అమూల్యమైనవిగా గుర్తించి జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజు ఉత్తమ అవార్డు రావడం అభినందనీయమని పెద్ద టాక్లి గ్రామస్తులు పేర్కొన్నారు. ఆ గ్రామాన్ని సందర్శించిన ఏ ఈ హనుమంతుకు గ్రామ పెద్దలు శాలువతో ఘనంగా సత్కరించారు. అవార్డును అభినందిస్తూ సత్కరించిన గ్రామ పెద్దలకు హౌసింగ్ ఏఈ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో గైక్వాడ్ విలాస్, సాయిలు గొండ, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు షాదుల్ సాబ్, సయ్యద్ జిలాని, ఉమాకాంత్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -