Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇసుక తరలిస్తే కఠిన చర్యలు: ఆర్ఐ సాయిబాబా

ఇసుక తరలిస్తే కఠిన చర్యలు: ఆర్ఐ సాయిబాబా

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మంజీరా నది నుండి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కుర్ల మంజీరా నుండి డోంగ్లి వైపువస్తున్న డోంగ్లి గ్రామంలో పట్టుకున్నట్లు డోంగ్లి మండల ఆర్ ఐ సాయిబాబా శనివారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా మంజీరా నది నుండి ఇసుక తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. పట్టుబడ్డ ట్రాక్టర్ను డోంగ్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేసినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -