- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్
మండలంలోని మంగ్లూరు గ్రామ శివారులోని సర్వే నంబర్ 165 భూమిలో 225 ఎకరాల భూమి ఉంది. అందులో రెవెన్యూ, ఫారెస్ట్ కు చెందిన భూమి ఉండడంతో ఫారెస్ట్ అధికారులు 225 ఎకరాల భూమి కి కంచే వేశారని మంగళూరు సర్పంచ్ నర్మల రాజు తెలిపారు. అందులో భాగంగా సన్నకారు రైతుల భూమి కోల్పోకుండా ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో జాయింట్ సర్వే చేయించి చిన్న, సన్నకారు రైతులకు న్యాయం చేయాలని ఆయన బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో డి ఏ ఓ వసంత కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



