Sunday, May 25, 2025
Homeఆటలుసర్ఫరాజ్ కు అవకాశం ఇవ్వకుండానే వేటు ఎలా వేస్తారు: గవాస్కర్

సర్ఫరాజ్ కు అవకాశం ఇవ్వకుండానే వేటు ఎలా వేస్తారు: గవాస్కర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత టెస్టు క్రికెట్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో, యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. అయితే కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో సర్ఫరాజ్‌ ఖాన్‌ భారత జట్టులోకి అడుగుపెట్టాడు. తరువాత ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో మాత్రం అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో అతని పేరు లేకపోవడంపై సునీల్‌ గవాస్కర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ తర్వాత రెడ్‌ బాల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు పెద్దగా జరగలేదు. రంజీ మ్యాచ్‌లు జరిగినా, గాయం కారణంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆడలేకపోయాడు. దీంతో అతను తన ఫామ్‌ను నిరూపించుకోవడానికి సరైన అవకాశం లేకుండా పోయింది. ఆడే అవకాశం ఇవ్వకుండానే సర్ఫరాజ్‌ ఖాన్‌పై ఎలా వేటు వేస్తారని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -