Monday, May 25, 2026
E-PAPER
Homeసినిమాన్యాయం కోసం పోరాడాల్సిందే

న్యాయం కోసం పోరాడాల్సిందే

- Advertisement -


అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మయాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్ జోన్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.
ఈనెల 28న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సోమవారం మేకర్స్ నిర్వహించిన ప్రెస్ మీట్లో అర్జున్ సర్జా మాట్లాడుతూ, ‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది. మన తల్లిదండ్రులకో, మన వాళ్ళకో అన్యాయం జరిగితే న్యాయం కోసం మనం ఖచ్చితంగా పోరాడతాం. అయితే ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా పోరాడాలి అనే సందేశాన్ని ఈ సినిమా చెబుతుంది. ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఎదురు చూడకుండా, మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి?, తల్లిదండ్రులుగా ఆడబిడ్డల్లో ధైర్యాన్ని ఎలా నింపాలి? వంటి అద్భుతమైన అంశాలు ఇందులో ఉంటాయి. నేను ఎన్నో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చేశాను. కానీ, ఈ సినిమాలో అభిరామి, ప్రీతి ముకుందన్ నాకంటే బాగా ఫైట్లు చేశారు. ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది, ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రవి బస్రూర్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. విజువల్స్ బాగుంటాయి. ఫైట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో నా పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సుభాష్ కె రాజ్ గొప్పగా సినిమాను తెరకెక్కించాడు. ఇది విభిన్నమైన చిత్రం. ప్రతి పాత్ర మీకు కనెక్ట్ అవుతుంది. ఇది మహిళా సాధికారతకు కమర్షియల్ అంశాలు జోడించి చేసిన గొప్ప చిత్రంఅని అన్నారు. 'ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మాస్ మూవీతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని నటి అభిరామి చెప్పారు.
నటి ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ,’ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందిఅని అన్నారు. 'నన్ను, నా కథను నమ్మి ఈ అవకాశమిచ్చిన నిర్మాత అఘోరంకి ధన్యవాదాలు. అందరి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అని దర్శకుడు సుభాష్ కె రాజ్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -