Friday, July 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభరోసా లేని పార్టీ బీఆర్ఎస్.. : ఎంపీ చామల

భరోసా లేని పార్టీ బీఆర్ఎస్.. : ఎంపీ చామల

- Advertisement -

నవతెలంగాణ ఆలేరు

భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్న భరోసా ఆ పార్టీ కార్యకర్తల్లోనే లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నవతెలంగాణతో మాట్లాడుతూ కేటీఆర్ క్యాడర్ ను కాపాడుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం అవుతాడని కేటీఆర్ పగటి కలలు కంటున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.10 ఏండ్లల్లో బీఆర్ఎస్ అవినీతి పాలన 20 ఏండ్లు అయినా ప్రజలు మర్చిపో రన్నారు. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాలు బీఆర్ఎస్ కోల్పోయిందన్నారు.

సంక్షేమ పథకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ సుస్థిరమైన అందిస్తూ ప్రజలకు మరింత చేరువైందన్నారు.మందుల సామేలు నా సోదరుడు మా మధ్యన ఎలాంటి గొడవలు లేవన్నారు. పార్టీ మండల కమిటీ అధ్యక్షులు విషయంలో వచ్చిన బేదాభిప్రాయాలు సర్దుకుంటాయన్నారు నేను కాంగ్రెస్ కార్యకర్తను మన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని సామేలును సూచనలు చేశాను పెత్తనం చేయలేదని అన్నారు. ఇది మా ఇంటి సమస్య సద్దుమణుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -