బూడిద బిక్షమయ్య
నవతెలంగాణ-ఆలేరు రూరల్
కాలేశ్వరం నీళ్లు ఇవ్వకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నవతెలంగాణ తో మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో సాగునీటి సమస్య తీవ్రమైందని రైతులు నారు పోసుకోలేని దుస్థితి ఉందన్నారు. గోదావరి నీరు సముద్రం పాలవుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. కెసిఆర్ కు పేరు వస్తుందని ప్రాజెక్టులు నింపడం లేదని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గంధ మల్ల బస్వాపూర్ ప్రాజెక్టులను దేవాదుల ద్వారా నవాబ్ పెట్ ప్రాజెక్టు నీటితో నింపాలన్నారు. రైతులను హరిగోశ పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ప్రారంభమైందన్నారు. జిల్లాలోని రైతులు ఉద్యమ బాట పట్టారని శుక్రవారం కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన ధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడమే నిదర్శనం అన్నారు. నీళ్లు ఇవ్వకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.
కాలేశ్వరం నీళ్లు ఇవ్వకుంటే సీఎం రాజీనామా చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



