Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిజిటల్ విద్యకు సర్పంచ్ పారిజాత చేయూత

డిజిటల్ విద్యకు సర్పంచ్ పారిజాత చేయూత

- Advertisement -

రూ.15 వేల విలువైన స్మార్ట్ టీవీ విరాళం
నవతెలంగాణ – పెద్దవంగర 
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్య అందించాలనే సంకల్పంతో పెద్దవంగర గ్రామ సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ రూ.15 వేలు మొదటి జీతంతో స్మార్ట్ టీవీని ఎక్స్ రోడ్డు ప్రాథమిక పాఠశాలకు విరాళంగా అందించారు. ఈ స్మార్ట్ టీవీని శుక్రవారం మండల విద్యాశాఖాధికారి బి. శ్రీనివాస్ సర్పంచ్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఎంఈవో మాట్లాడుతూ స్మార్ట్ టీవీ ద్వారా విద్యార్థులు ఆడియో–విజువల్ విధానంలో పాఠాలను సులభంగా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సర్పంచ్ దంపతులు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న సర్పంచ్ దంపతులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వినోద్, ఉపాధ్యాయులు సౌభాగ్య, నాయకులు గద్దల ఉప్పలయ్య, మోహన్ రావు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -