Thursday, July 30, 2026
E-PAPER
HomeఆటలుCommonwealth Games-2026: ఫైనల్ కు నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు

Commonwealth Games-2026: ఫైనల్ కు నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్ పురుషుల జావెలిన్ త్రో ఆటలో భారత్ పేయర్లు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఫైనల్‌ పోరుకు నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్, యశ్ వీర్ సింగ్ లు అర్హత సాధించారు. నీరజ్.. మొదటి త్రోలో 76.28 మీటర్ల, రెండో త్రోలో 79.61 మీటర్లతో ఐదో స్థానంలో నిలిచాడు. యశ్ వీర్ సింగ్ చివరి ప్రయత్నంలో 78.36 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, 10వ స్థానంలో నిలిచి ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు.రోహిత్ యాదవ్ కూడా నిలకడైన ప్రదర్శనతో 77.04 మీటర్ల, రెండవ రౌండ్‌లో 78.37 మీటర్ల అత్యుత్తమ త్రోను నమోదు చేసి, ఓవరాల్‌గా తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. అయితే శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాగే, 82.84 మీటర్ల అద్భుతమైన త్రోతో క్వాలిఫికేషన్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -