- సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా తొలి రోజు చోటుచేసుకున్న సంఘటనలపై ప్రత్యేకంగా విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర విచారణ కోసం జాయింట్ సీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫామ్‌హౌస్‌లో ఉండి కుట్రలు చేసేవారిపైనా చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. అసెంబ్లీ ఘటనకు సంబంధించి క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరిపిస్తామని చెప్పారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ బాధ్యతగా వ్యవహరించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దళితులు తిరిగిన ప్రాంతాన్ని శుద్ధి చేసి ఉన్మాదాన్ని చాటుకున్నారని మండిపడ్డారు. జరిగిన తప్పిదాన్ని గుర్తించి దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకుని క్షమాపణ చెబితే వారి కిరీటం కిందపడుతుందా? అని ప్రశ్నించారు. దళితులను ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.



