Wednesday, September 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమరజీవి కోలా కిషన్‌కు ఘన నివాళి

అమరజీవి కోలా కిషన్‌కు ఘన నివాళి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్‌
భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నాయకుడు, అమరజీవి కామ్రేడ్‌ కోలా కిషన్‌ 22వ వర్ధంతిని ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో సీపీఐ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముందుగా ఆయన స్థూపాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్‌ మాట్లాడుతూ.. కామ్రేడ్‌ కోలా కిషన్‌ ఈ ప్రాంత ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన ప్రజా నాయకుడని కొనియాడారు. ముఖ్యంగా ఈ ప్రాంత నదీ జలాల సాధనతో పాటు గంధమల్ల రిజర్వాయర్‌ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.ఆలేరు నియోజకవర్గంలోని రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన గొప్ప నాయకుడు కోలా కిషన్‌ అని గుర్తుచేశారు.ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని అన్నారు.కార్యక్రమంలో పున్నబోయిన రవి, కోలా దయానంద్‌,సుకేప్‌,మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -