నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధలోని మేనూరు గ్రామ శివారు జాతీయ రహదారి 161 పక్కన ఓ వ్యక్తి భూములు కొనుగోలు చేసి వెంచర్ వేసిన విషయమై ప్రజావాణిలో భాన్సువాడ ఆర్డీఓ రవీందర్‌రెడ్డికి స్తానిక రైతులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నో ఏండ్ల దారిని అక్రమ వెంచర్ మూలంగా మూసివేశారనీ, పొలాల్లోకి పారే వరద నీటిని దారి మళ్ళించారనీ, దీంతో పంట పొలాల్లోకి వెళ్లాలన్నా.. వ్యవసాయ పనులు చేయాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆర్డీఓ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంచర్ చుట్టూ అరగంట సేపు తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. భూమి కొన్నప్పుడు చుట్టు పక్కల ఉన్న భూములు కొలతలు కొలవకుండా..మీ ఇష్టారీతిన రిజిస్ట్రేషన్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వరద నీరు దారి మళ్ళింపుపై ఇరిగేషన్ అధికారులతో సమగ్ర విచారణ చేయించి, రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహశీల్దార్ ముజీబ్, ఆర్ఐ మురళీధర్, సర్వేయర్ వెంకట్రావు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
అక్రమ వెంచర్‌ను పరిశీలించిన ఆర్డీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



