Wednesday, September 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐఆర్ ప్రత్యేక క్యాంప్ లో పాల్గొన్న ఆర్డీఓ

ఎస్ఐఆర్ ప్రత్యేక క్యాంప్ లో పాల్గొన్న ఆర్డీఓ

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మండల పరిధిలోని పెద్ద ఎక్లరాలో ఏర్పాటుచేసిన ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రత్యేక హీయరింగ్ క్యాంప్‌ కార్యక్రమానికి బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి బుధవారం హాజరయ్యారు. ఈ క్రమంలో అధికారులు, గ్రామ ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సమస్యలను పరిశీలించి, ఎస్ఐఆర్ ప్రక్రియ సక్రమంగా కొనసాగుతున్న తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎస్‌ఐఆర్‌ పై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ముజీబ్ , గ్రామ సర్పంచ్ మహేష్, ఉప సర్పంచ్ సంగమేశ్వర్, సీనియర్ నాయకులు హనుమంతరావు దేశాయ్, వార్డు సభ్యులు మాధు, బాబు , అభిషేక్ పటేల్, సంబంధిత అధికారులు, సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -