- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ నెల తొమ్మిదిన కనీస వేతనం రూ.18 వేలు అమలుకై ఛలో అసెంబ్లీ ముట్టడికి తరిలిన ఆశాలను పోలీసులు అడ్డుకుని, నానా ఇబ్బందులు పెట్టడం తీవ్ర దుర్మార్గమని రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా బుధవారం తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై తహశీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఆర్‌ఐ మురళికి వినతిపత్రాలను సమర్పించారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయాల ముందు ధర్నా, ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో భారీ ఎత్తున మండల వ్యాప్తంగా ఉన్న ఆశావర్కర్లు పాల్గొన్నారు.
- Advertisement -



