Wednesday, September 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను అరెస్టు చేయాలి

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను అరెస్టు చేయాలి

- Advertisement -

– సర్పంచుల ఫోరం అధ్యక్షులు భాస్కర్ రెడ్డి
నవతెలంగాణ – సిద్దిపేటరూరల్ 
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రశేఖర్ రావు మరణాన్ని కోరుకుంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై కేసు నమోదు చేసి చట్టప్రకారం అరెస్టు చేయాలని సిద్దిపేట రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌లు డిమాండ్ చేశారు. సిద్దిపేట రూరల్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం సిద్దిపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని సర్పంచ్‌ల ఫోరం బహిష్కరించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కేసీఆర్ మరణాన్ని కోరుకుంటూ మాట్లాడటం నీచమైన చర్య అని మండిపడ్డారు. శంకర్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు రత్నాకర్ గౌడ్, కోడూరు మమత రాజు, పద్మ శ్రీనివాస్, నాగరాజు, తిరుపతి, కృష్ణ, దేవేందర్  గౌడ్, పద్మాదేవి గోపీనాథ్, బాల్ రాజ్,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -