Wednesday, September 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూముల రీ-సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి

భూముల రీ-సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -

ప్రభుత్వ, అటవీ భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలి
జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
నవతెలంగాణ-అచ్చంపేట
నాగర్‌కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. బుధవారం అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని చెన్నారం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియ, పనుల పురోగతిని అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చబ్రాతో కలిసి పరిశీలించారు.  

ఇందులో భాగంగా చెన్నారం గ్రామంలో 76 సర్వే నంబర్ల పరిధిలో ఉన్న మొత్తం 847 ఎకరాల 20 గుంటల భూమిలో 147 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు ఏడి ల్యాండ్ సర్వే గిరిధర్ కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన రీ-సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, రైతులకు సంబంధించిన భూముల రీ-సర్వే పనులను నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు చేపడుతూ కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 70 గ్రామాల్లో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలనీ, అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలనీ, భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలించిన అనంతరం మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ భూములు, అటవీ భూములకు సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా పరిశీలించి, భూముల హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లు తదితర వివరాలను పక్కాగా నమోదు చేయాలనీ, భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు రాకుండా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి, పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా బోధనపై ఆరా తీశారు.

పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచాలని సూచించారు. సర్పంచ్ హేమలత గ్రామంలో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. జీపీ నిధుల నుంచి అవసరమైన చర్యలు చేపట్టి ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏడి ల్యాండ్ సర్వే గిరిధర్, తాహసిల్దార్ సైదులు, సంబంధిత అధికారులు, సిబ్బంది, గ్రామ సర్పంచ్ ప్రేమలత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -