Wednesday, September 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పురుగు యాజమాన్య పద్ధతులపై అవగాహన 

పురుగు యాజమాన్య పద్ధతులపై అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని కొట్టాల గ్రామంలో బుధవారం మండల వ్యవసాయ అధికారి మర్రు సాహస్ ఆధ్వర్యంలో పత్తిలో ఐ పీ ఎం (సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతులు) ప్రదర్శన ఏర్పాటు చేశారు.అందులో భాగంగా లో పంట పర్యవేక్షణ, పురుగు గుర్తింపు, ఇటియల్ అంచనా, జీవ/యాంత్రిక/సాగు పద్ధతులను వివరించి అవసరమైతే మాత్రమే రసాయన నియంత్రణ అనే విధానాన్ని పాటించాలని సూచించారు. అదేవిధంగా పంటలపై వాతావరణ ప్రభావం అందుకు ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలెట్ల లింగయ్య, బుర్ర శేఖర్, పెద్దమారయ్య, కృష్ణయ్య, వెంకటయ్య, శంకర్, లక్ష్మమ్మ , శైలజ, ఏఈఓ అరుణ, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -