Wednesday, September 9, 2026
E-PAPER
Homeజాతీయంబ్రిక్స్ సదస్సు..విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు

బ్రిక్స్ సదస్సు..విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో బ్రిక్స్ సమావేశాలకు సన్నాహాలు ఊపుందకున్నాయి. భారత్ మండపం వేదికగా సెప్టెంబర్ 11 నుండి 13 వరకు మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు (BRICS సదస్సు) జరగనుంది. కూటమి లోని సభ్యదేశాలతో పాటు ఇతర ప్రముఖులు సదస్సుకు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో విస్తృతమైన భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

పటిష్టమైన భదత్రా కోసం బయోమెట్రిక్ పాస్‌లు, సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక నిఘాను అందుబాటులోకి తెచ్చారు. అదే సమయంలో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) బృందాలు అప్రమత్తంగా ఉంటాయి. డ్రోన్‌లు, వైమానిక దళంతో సదస్సు పరిసర ప్రాంతాల్లో భద్రతా సంస్థలు నిఘా పెట్టనున్నాయి. వీవీఐపీ కాన్వాయ్ కదలికలను పర్యవేక్షించడానికి జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థను వినియోగించనున్నారు. ఆకస్మిక విపత్తులు తలెత్తినప్పుడు త్వరితగతిన స్పందించడానికి అగ్నిమాపక సేవలు, అంబులెన్సులు, వైద్య అత్యవసర బృందాలు సిద్ధంగా ఉంటాయి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాన్ని గుర్తించడానికి, నిఘా సమాచార మార్పిడి , సరిహద్దు తనిఖీలను పటిష్టం చేస్తూ ఢిల్లీ పొరుగు రాష్ట్రాలతో కూడా భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేశారు.

పలు చోట్ల BRICS బ్యానర్లు పోస్టర్లు ఏర్పాటు చేశారు. కన్నాట్ ప్లేస్ ఖాన్ మార్కెట్‌తో సహా ప్రధాన ప్రాంతాలు, మార్కెట్లలో రాత్రి వేళల్లో అదనపు విద్యుత్ దీపాలంకరణలు కూడా ఏర్పాటు చేశారు. భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్ల దృష్ట్యా ఢిల్లీలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించానున్నారు. ప్రయివేటు సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -