Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యంగ్ హేర్త్ లీడర్ శిక్షణ తరగతులకు తరలిన విద్యార్థులు

యంగ్ హేర్త్ లీడర్ శిక్షణ తరగతులకు తరలిన విద్యార్థులు

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
ఆలేరు జిల్లా ప్రజా పరిషత్  బాలుర ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థులు పిఎం యంగ్ ఎర్త్ లీడర్ శిక్షణలో భాగంగా శుక్రవారం హైదరాబాదులో జరిగే శిక్షణ కార్యక్రమానికి తరలివెళ్ళారు.  విద్యార్థులు పర్యావరణ పరమైన అంశాలపై రెండు రోజుల పాటు శిక్షణ పొంది వచ్చి ఇక్కడి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. వాతావరణంలో వస్తున్న మార్పులు ఏ కారణాల వలన వస్తున్నాయి, వాటిని నివారిస్తూ ప్రకృతికి ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై శిక్షణ పొందుతారు. విద్యార్థులకు ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు దాసరి మంజుల ,ఉపాధ్యాయ బృందం వీడ్కోలు పలికారు.విద్యార్థుల వెంట  పాఠశాల పీడీ పూల నాగయ్య వెళ్ళారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -