నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కోరుతూ.. శుక్రవారం చేపట్టాల్సిన బంద్ ను విజయవంతం చేయాలని, సాధన కమిటీ సభ్యులు ఆలేరు పట్టణంలో గురువారం పట్టణంలోని మెయిన్ రోడ్ మొదలుకుని బైపాస్ రోడ్ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి, పోచమ్మ వీధి, కొలనుపాక రోడ్డు, జీడికల్ రోడ్ల వెంట బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో నిరసన కారులు ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలని భారీగా నినాదాలు చేశారు. ఈ నెల 31న ఆలేరులోని అన్ని పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆలేరు అభివృద్ధి కోసం జరిగే ఈ బంద్ లో సకల జనులైన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, మీడియా ప్రతినిధులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని ముక్త కంఠంతో కోరారు.
అనంతరం ఆ కమిటీ సభ్యులు పట్టణ బంద్ సంబంధిత కరపత్రాన్ని పట్టణమంతా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ పసుపునుర్ వీరేశం, కో కన్వీనర్లు రాచకొండ జనార్ధన్ , మొరిగాడి చంద్రశేఖర్ , మొరిగాడి రమేష్, జింకల రామకృష్ణ, వడ్డేమాన్ నరేందర్ ,పుట్ట మల్లేష్, ఎలుగల కుమారస్వామి, కళ్ళేపు అడవయ్య, బేతి రాములు, తుంగ కుమార్, మంగ నరసింహులు, పూజారి కుమారస్వామి, భేతి కృష్ణ హరి, వడ్డేమాన్ బాలరాజు, ఎలుగల వెంకటేష్, చింటూ, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.



