Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి 

పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి 

- Advertisement -

బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి 
నవతెలంగాణ-మిడ్జిల్

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ, విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా మాజీ అధ్యక్షుడు పల్లె తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని, రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగం చేస్తోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందక పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.15,000 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి: గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలి: కాలేజీలకు ప్రభుత్వ నిధులు రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని, దీనివల్ల పైచదువులకు, ఉద్యోగ అవకాశాలకు విద్యార్థులు దూరమవుతున్నారని గుర్తు చేశారు. నిలిచిపోయిన సర్టిఫికెట్లను వెంటనే విద్యార్థులకు అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సంతకాల సేకరణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారు. విద్యార్థుల సమస్యలు తీరేవరకు బిజెపి ,బిజెవైఎం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మిడ్జిల్ మండల బిజెపి, అధ్యక్షులునరేష్ నాయక్ బిజెవైఎం నాయకులు, నవీన్,శేఖర్,సిద్దు,శివ,హరీష్, విష్ణు,మణికంఠ, శ్రీధర్, చిక్కొండ శివ, భరత్, రమేష్, నరష్ కళాశాలల విద్యార్థులు  కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -