- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూసీ సమీపంలోని డెకరేషన్ దుకాణంలో మంటలు చెలరేగాయి. సుమారు 10 గోదాములకు మంటలు వ్యాపించి భారీగా ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.
- Advertisement -


