నవతెలంగాణ – జుక్కల్
మండల వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ తలపెట్టిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల, కళాశాలలు బంద్ శుక్రవారం విజయవంతమైంది. సుమారు రూ.11 వేల కోట్లు పెండింగ్ లో ఉన్న ఫీజు రియబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలనే ప్రధాన ఉద్ధేశంతోనే ఈ బంద్ కు పూనుకున్నట్టు విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలను బలోపుతం చేయాలన్నారు. దాదాపుగా రాష్టవ్యాప్తంగా ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలలను తొలగించాలని యోచిస్తున్న సర్కార్ నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా, హాస్టల్ సదుపాయాలు కల్పించాలనీ, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. ప్రయివేటు కార్పొరేటు విద్యాసంస్థల్లో ప్రభుత్వ ఫీజు స్ట్రక్చర్ అమలు చేయాలి డిమాండ్ చేశారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ( SFI ) జిల్లా అధ్యక్షులు ఎస్. అజయ్ కుమార్, జుక్కల్ మండల నాయకులు జాబీర్, భానుప్రసాద్, జమీల్, తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్ లో విద్యాసంస్థల బంద్ విజయవంతం
- Advertisement -
- Advertisement -



