Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలాస్ ఎస్టీ హాస్టల్ ను సందర్శించిన జెడ్పీసీఈఓ

కౌలాస్ ఎస్టీ హాస్టల్ ను సందర్శించిన జెడ్పీసీఈఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని కౌలాస్ గ్రామం గిరిజన హాస్టల్ ని కామారెడ్డి జిల్లా జడ్పీ సీఈవో చందర్ నాయక్ ఎంపీడీవోతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్టీ హాస్టల్ భవనం పరిస్థితి , మరుగుదొడ్లు, వంటశాల, ఆట స్థలం, మధ్యాహ్న భోజన వసతి సౌకర్యాలు పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించడంతోపాటు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఏ డబ్ల్యు సి కు సూచించారు. అనంతరం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు  విద్యా బొధన విషయాలను విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. అంతకుముందు జెడ్పి సీఈఓ కు గ్రామ సర్పంచ్, జెడ్ పి హెచ్ స్ ఉపాధ్యాయుల బృందం, గ్రామస్తుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు కలిసి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో తో పాటు ఎంపీడీవో శ్రీనివాస్,  కౌలాస్ గ్రామ సర్పంచ్ తండ్రి విద్య , ఎడబ్ల్యుసి , జిపి కార్యవర్గ సభ్యులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -