నవతెలంగాణ – హైదరాబాద్ : కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్‌లో అమెరికా బలగాలు సోమవారం రక్షణాత్మక దాడులు నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరాన్ బలగాల నుంచి తమ సైనికులకు ముప్పు పొంచి ఉన్నందునే ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ మాట్లాడుతూ.. ఇరాన్‌కు చెందిన క్షిపణి ప్రయోగ కేంద్రాలు, వ్యూహాత్మక జలమార్గంలో మైన్‌లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు తెలిపారు. మరోవైపు హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉన్న బందర్ అబ్బాస్, సిరిక్, జాస్క్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు వినిపించినట్లు ఇరాన్ మీడియా సంస్థలు తస్నిమ్, ఫార్స్ వెల్లడించాయి. అయితే, బందర్ అబ్బాస్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెహర్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
ఇరాన్‌లో అమెరికా దాడులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



