Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి

అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి

- Advertisement -

టిడిపి మండల అధ్యక్షులు దోమల వెంకటయ్య యాదవ్
నవతెలంగాణ-మర్రిగూడ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను అసభ్య పదజాలంతో దూషించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దోమల వెంకటయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు బాధ్యతతో ప్రజాస్వామ్య రీతిలో వ్యవహరించాలే తప్ప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అసభ్య పదజాలంతో బూతులు తిడితే ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు చూస్తూ ఊరుకోరని అన్నారు. అంబటి రాంబాబు చంద్రబాబుకు వెంటనే బహిరంగ  క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో అంబటి రాంబాబు ను తెలంగాణలో ఎక్కడ తిరగనియ్యవమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ప్రజాస్వామ్యంపై విలువ ఉంటే తక్షణమే అంబటి రాంబాబును పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -