Tuesday, May 26, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఇంధ‌న ధ‌ర‌ల‌ పెంపును నిర‌సిస్తూ సీపీఐ(ఎం) ఆందోళ‌న‌

ఇంధ‌న ధ‌ర‌ల‌ పెంపును నిర‌సిస్తూ సీపీఐ(ఎం) ఆందోళ‌న‌

- Advertisement -
  • గోల్కొండ చౌరస్తా నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ వ‌ర‌కు రిక్షా తొక్కి నిరసన

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: సామాన్య ప్ర‌జ‌లపై పెట్రోలు ధ‌ర‌ల మోత మోగుతుంది. ఒకే నెల‌ల్లో నాలుగుసార్లు ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచింది మోడీ ప్ర‌భుత్వం. బీజేపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై దేశవ్యాప్తంగా వ్య‌తిరేక‌త వెలువెత్తుతుంది. తాజాగా చ‌మురు రేట్ల ధ‌ర‌ల పెంపును నిర‌సిస్తూ, పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్ల‌ను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) పార్టీ డిమాండ్ చేసింది. మంగ‌ళ‌వారం హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తా నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ వ‌ర‌కు రిక్షా తొక్కి నిరసన తెలియ‌జేసింది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు రేట్లు తగ్గుతుంటే కేంద్రంలోని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం యుద్ధం పేరు చెప్పి ఆదానీ, అంబానీల లాభాల కోసం ఇంధ‌న ధ‌ర‌లు పెంచి, సామాన్య ప్రజలపై భారం వేస్తోంద‌ని ఆ పార్టీ నేత‌లు మండిప‌డ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -