నవతెలంగాణ-కమ్మర్ పల్లి: మండలంలోని బషీరాబాద్ గ్రామంలో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ఊరు–మన భద్రత, మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మధుకర్ గ్రామస్థులకు సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. సీసీటీవీ వ్యవస్థలు 24 గంటల పర్యవేక్షణ ద్వారా అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడంలో, నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరిస్తాయని తెలిపారు.గ్రామ ప్రజలు తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ యువకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
బషీరాబాద్ గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



