Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు

కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు

- Advertisement -

– జుక్కల్ ప్రజలకు గర్వకారణం.!
నవతెలంగాణ – జుక్కల్ 

జుక్కల్ నియోజకవర్గంలోని చారిత్రక కౌలాస్ కోటను పిపిపీ (PPP ) (Public-Private Partnership) విధానంలో అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసిన కోటల జాబితాలో చేర్చడం హర్షణీయం. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు కృషి, చొరవతో కౌలాస్ కోటకు మరింత ప్రాధాన్యత లభించడం నియోజకవర్గ ప్రజలకు గర్వకారణం.

కౌలాస్ కోట చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేస్తే పర్యాటకుల రాక పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

కౌలాస్ కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతిస్తున్నాము. కౌలాస్ కోట అభివృద్ధి – జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి మరో ముందడుగు వేయడంతో ముఖ్యంగా కౌలాస్ గ్రామస్తులతో పాటు మండల ప్రజలు హర్షం వ్యక్తమవుతోంది. ఎమ్మేల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన చేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -